Woman Requested KTR : ఓ చెల్లెలి మొర విన్న కేటీఆర్‌

Woman Requested KTR : రక్షాబంధన్ అంటేనే అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.

Update: 2020-08-03 12:34 GMT
మహిళతో మాట్లాడుతున్న కేటీఆర్

Woman Requested KTR : రక్షాబంధన్ అంటేనే అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. చెల్లికి, అక్కకి ఆపద వస్తే అన్న దమ్ములు ఆదుకుంటారనే బాసట. అంతటి పవిత్రమైన రాఖీ పండగ రోజున ఓ చెల్లెలు తన అన్న ప్రాణాలు కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌ను వేడుకుంది. ఈ సంఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వేములవాడ మండలం వావిలాలకు చెందిన పోచయ్య అనే వ్యక్తి కిడ్నీ పేషెంట్. కాగా అతను కొద్ది రోజులుగా జ్వరంలో బాధపడుతూ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అక్కడి వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పోచయ్యను పటించుకోకపోవడంతో అతని సోదరి తట్టుకోలేక విలవిల్లాడింది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది.

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ రాఖీ పండుగ రోజు సిరిసిల్ల ఆసుపత్రికి రావడంతో ఆయనను చూసిన ఆ సోదరి తన అన్న ప్రాణాలు కాపాడాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఆస్పత్రి సిబ్బంది అక్కడికి వచ్చి రోగులను సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ డాక్టర్లు బిజీగా ఉన్నారని సమాధారం చెపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న ప్రాణాలు కాపాడటానికి చెల్లెలు పోరాటానికి దిగిన ఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు. అది చూసిన మంత్రి కేటీఆర్ ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణం అవుతున్న సమయంలో బాధిత మహిళను పలకరించి, కిడ్నీ పేషంట్‌ పోచయ్యకు మెరుగైన వైద్యం అందించాలని సబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. రాకీ పండగ రోజున కేటీఆర్‌ అన్నయ్య అభయంతో ఆ చెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. 

 



Tags:    

Similar News