Musi River: మూసీ నది ఇప్పుడైనా ప్రక్షాళనకు నోచుకుంటుందా..?

Musi River: మూడు నెలల్లోగా పనులు ప్రారంభించాలని సీఎం ఆర్డర్స్

Update: 2024-01-04 14:45 GMT

Musi River: మూసీ నది ఇప్పుడైనా ప్రక్షాళనకు నోచుకుంటుందా..? 

Musi River: మూసీ నది ఇప్పుడైనా ప్రక్షాళనకు నోచుకుంటుందా..? పురాతన నది సుందరీకరణ పనులు ముందుకు సాగుతాయా..? హైదరాబాద్ వాసులకు మురుగు కంపు బెడద తప్పుతుందా..? మూసీ అంటేనే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి నుంచి.. ఎంచక్కా నది ఒడ్డున సేద తీరే రోజులు వస్తాయా..? చెత్తా చెదారంతో నిండి వరదలకు కారణం అవుతున్న మూసీ నీరు సాఫీగా సాగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా..?

కాంగ్రెస్‌ సర్కార్ దూకుడు చూస్తుంటే మూసీ సుందరీకరణ త్వరలోనే నిజం కాబోతుందనే సమాధానాలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రక్షాళనపై గత సర్కార్ కూడా దృష్టి పెట్టినా ఆ దిశగా పనులు మాత్రం సాగలేదు. మూసీ వాటర్‌ను కొబ్బరి నీళ్లలా చేస్తామని, అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉంది మూసీ పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. తాము గత ప్రభుత్వంలా కాదని మూసీ నదిని అందంగా తీర్చిదిద్దుతాం అంటోంది. అందుకోసం ఏ డెడ్‌లైన్‌ను పెట్టుకుంది.

నగరాలకు అందం. నదులు, కాలువలే. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పెద్ద పెద్ద పట్టణాలు, నగరాఅన్నీ నదీ తీరాన నిర్మించబడ్డయే. హైదరాబాద్‌కు కూడా మూసీ నది ఓ వరం. చాలా ఏళ్లుగా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చింది. కానీ నది నిర్వహణ లోపం, ప్రభుత్వాల పట్టింపులేని తనం, అక్రమణలు మూసీ నదికి శాపంగా మారింది. రాను రాను తాగునీటి నదిని కాస్త.. మురుగు నీటిగా మార్చారు. మూసీ నదిని నిర్లక్ష‌్యం చేస్తే కలిగే అనర్థాలను గుర్తించిన ప్రభుత్వాలు మళ్లీ..నదీ సుందరీకరణను పూనుకున్నాయి. రేవంత్‌ రెడ్డి సర్కార్..మూవీ నది ప్రక్షాళనపై సీరియస్‌గా దృష‌్టి సారించింది. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా.. ఓ డెడ్‌లైన్ పెట్టుకుని పనులు జరగాలను అధికారులకు స్ట్రిక్ట్‌గా ఆర్డర్స్ వేశారు.

మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తొలుత హైదరాబాద్ పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్యూస్‌మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాన్నారు. ఇందుకోసం విదేశాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్ ల డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ నది పరీవాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు చార్మినార్, తారామతి బరాదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందిచాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News