తెలంగాణ శాసనమండలి చైర్మన్ పదవి భర్తీకి ముహూర్తం ఖరారు

Telangana Legislative Council Chairman: తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి భర్తీకి ముహూర్తం ఖరారైంది.

Update: 2022-03-09 09:11 GMT

తెలంగాణ శాసనమండలి చైర్మన్ పదవి భర్తీకి ముహూర్తం ఖరారు

Telangana Legislative Council Chairman: తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి భర్తీకి ముహూర్తం ఖరారైంది. ఇన్నాళ్లు ప్రొటెం చైర్మన్‌తో నడుస్తున్న సభకు పూర్తి స్థాయిలో సభాపతి రాబోతున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వడమే ఆలస్యం నోటిఫికేషన్ రిలీజ్ కోసం శాసనసభ సచివాలయం ప్రక్రియ మొదలు పెట్టనుంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం ముగియగానే పెద్దల సభకు భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. అయితే భూపాల్ రెడ్డి పదవి కాలం పూర్తి అవ్వగానే పూర్తి స్థాయిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను నియమిస్తారనుకున్నారు అంతా. కానీ మళ్ళీ ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రిని ప్రొటెం చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ప్రొటెం చైర్మన్‌తో నడుస్తున్నాయి. కానీ ఈ సమావేశంలోనే పూర్తి స్థాయి చైర్మన్, డిప్యూటి చైర్మన్ లతో పాటు ఖాళీగా ఉన్న చిప్ విప్, విప్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

చైర్మన్‌గా మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అయితే దళిత కోటలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ చైర్మన్ రేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బండ ప్రకాష్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లతో పాటు చీప్ విప్, విప్ పదవులు కూడా ఈ సమావేశంలోనే భర్తీ చెయ్యనున్నటు సమాచారం. చీఫ్ విప్ రేసులో ప్రస్తుత విప్ ఎంఎస్ ప్రభాకర్ పేరు జోరుగా ప్రచారమవుతుంది. అటు విప్ పదవులు కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం.

మొత్తానికి మండలి పదవులు గవర్నర్ అనుమతిపై ఆధారపడి ఉన్నాయి. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు దూరం పెరిగిన నేపథ్యంలో ఏలాంటి నిర్ణయం వస్తుందాని అంతా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News