Kishan Reddy: దేశంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. దళారుల అక్రమాలకు చెక్ పెడతాం

Kishan Reddy: అన్నిరకాల సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి తెస్తాం

Update: 2023-07-26 09:35 GMT

దేశంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. దళారుల అక్రమాలకు చెక్ పెడతాం

Kishan Reddy: మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు, పనిముట్లు అందిస్తున్నామన్నారు..

ఇప్పటి వరకు కిసాన్ సమృద్ధి యోజన కింద పనిచేస్తున్న ఎరువుల రిటైల్ షాపులను రేపటి నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మార్చబోతున్నామన్నారు.. ఒకే దేశం - ఒకే ఎరువు నినాదంతో భారత్ బ్రాండ్ పేరుతో ఎరువులను రైతులకు అందిస్తామన్నారాయన..

రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.. ఇందులో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్స్ ఉంటాయని తెలిపారు.. నిర్దేశించిన ధరల ప్రకారమే విక్రయిస్తారని, ఇష్టారీతిన అధిక ధరలకు విక్రయిస్తున్న దళారుల అక్రమాలకు చెక్ పెడతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి....

Tags:    

Similar News