Wanaparthy: దాదాపుగా 20 గ్రామాలకు అందని తాగునీరు.. అధికారులు స్పందించాలని గ్రామస్తుల ధర్నా
Wanaparthy: 8 రోజులుగా నిలిచిపోయిన మిషన్ భగీరథ వాటర్ సప్లై
Wanaparthy: దాదాపుగా 20 గ్రామాలకు అందని తాగునీరు.. అధికారులు స్పందించాలని గ్రామస్తుల ధర్నా
Wanaparthy: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న ఫిల్టర్ బెడ్ దగ్గర గ్రామస్తులు ధర్నాకు దిగారు. శ్రీరంగాపురం మండల పరిధిలోని ప్రజలు 8 రోజుల నుంచి త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీరు నిలిచిపోవడంతో దాదాపుగా 20 గ్రామాలకు తాగునీరు అందడం లేదు. దీంతో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని.. శ్రీరంగపురం గ్రామ సర్పంచ్ వినీల డిమాండ్ చేశారు. గ్రామస్తులు తనను నిలదీస్తున్నారని.. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.