ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
Adilabad: జలకళ సంతరించుకున్న కుంటాల, పొచ్చర జలపాతాలు
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
Adilabad: తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు జలకళ సంతరించుకుంది. తొలకరి జల్లులకు ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చర జలపాతాలకు జలకళ సంతరించుకుంది.
గత కొన్ని రోజులుగా నేరెడిగోండ, బోథ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతాల వద్ద వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పచ్చని చెట్ల మధ్య రాతి శిలలపై భారీగా వరద నీరు జాలువారుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. వేసవిలో నీరు లేక బోసిపోయినా జలపాతాలు మళ్లీ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులు తాకిడి తిరిగి ప్రారంభమైంది.