Himabindu Arrest: వీఎంసీ సిస్టమ్స్‌ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందు అరెస్ట్

Himabindu Arrest: రూ.17వందల కోట్ల ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ

Update: 2021-08-05 12:22 GMT

ఉప్పలపాటి హిమబిందును అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఫైల్ ఇమేజ్)

Himabindu Arrest: నకీల పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన వీఎంసీ లిమిటె‌డ్‌‌ కంపెనీ డైరెక్టర్ హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 2018లో కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకటరామారావు, వెంకటరమణపై.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ముగ్గురు డైరెక్టర్లకు విచారణకు సహకరించాలని నోటీసులిచ్చింది. అయితే డైరెక్టర్లు స్పందించకపోవడంతో హిమబిందును అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.

కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు అభియోగాలొచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 539 కోట్లు ఎస్బీఐ, ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి 12 వందల 7 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అయితే బీఎస్‌ఎన్ఎల్‌ నుంచి రావాల్సిన బకాయిలు వస్తే డబ్బులు చెల్లిస్తామని సీబీఐ అధికారులని నమ్మించారు డైరెక్టర్లు. వాస్తవానికి రావాల్సింది 33 కోట్లు ఉంటే 262 కోట్లు రావాల్సి ఉందని రూ.262 కోట్లు రావాల్సి ఉందని తప్పుదోవ పట్టించారు. 

Full View


Tags:    

Similar News