Vizag Steel Plant: మంత్రి కేటీఆర్ పై రాములమ్మ సెటైర్

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫేస్‌బుక్‌లో స్పందించారు.

Update: 2021-03-12 06:25 GMT

ఇమేజ్ సోర్స్:( ది హన్స్ ఇండియా)

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. దీని పై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అంతే కాదు వీలైతే విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారు. దీని పై బిజెపి నేత విజయశాంతి ఫేస్ బుక్ లో స్పందించారు. ఓ సామెతను ఉదాహరణగా తీసుకుని కేటీఆర్‌పై సెటైర్ వేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ కేటీఆర్‌పై వ్యంగాస్త్రం సంధించారు. తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు.

గతం గుర్తు చేసుకోవాలంటున్న రాములమ్మ..

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది'' అని రాములమ్మ పేర్కొన్నారు.

దొందూ దొందే...

దొందూ దొందే అన్న చందంగా ప్రజల బాధను పట్టించుకొనేటోడు లేరని సాధారణ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే రాములమ్మ ఏపీలో ఆడవాళ్ళు రోడ్డున పడి 400 రోజులు దాటుతున్నా స్పందించలేని ఆమె.. ప్రజల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న వారిపై సెటైర్ వేయడంతో ప్రజలు అవాక్కవుతున్నారు.

Tags:    

Similar News