Vigilance Awareness Week: సికింద్రాబాద్‌లో విజిలెన్స్ వారోత్సవాలు

*కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, ఉద్యోగులు *అవినీతిపై అవగాహన కల్పిస్తున్నాం : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్

Update: 2021-10-30 06:32 GMT

సికింద్రాబాద్‌లో విజిలెన్స్ వారోత్సవాలు(ఫైల్ ఫోటో)

Vigilance Awareness Week: అవినీతి రహిత దేశం కోసం అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవెర్నెస్ వీక్ నిర్వహిం చామని పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్-1 హెడ్ క్వార్టర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ వి.జె.జోసెఫ్ అన్నారు. సికింద్రాబాద్ సంజీవయ్య పార్క్ వద్ద విజిలెన్స్ అవెర్నెస్ వీక్‌లో జనరల్ మేనేజర్ HR బి.ఎస్.రావు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పవర్ గ్రిడ్ సంస్థల్లో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా 30 పాఠశాలలు, 15 కాలేజీల్లో విద్యార్థులకు అవినీతిపై అవగాహన, దాన్ని ఎదుర్కొవడానికి సమాజంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ వ్యాస రచన పోటీలు, డిబేట్ తదితర పోటీలను నిర్వహించామన్నారు.

Full View
Tags:    

Similar News