Vegetable Prices: షాక్ కొడుతున్న కూరగాయల ధరలు
Vegetable Prices: పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు
Vegetable Prices: షాక్ కొడుతున్న కూరగాయల ధరలు
Vegetable Prices: పెద్దపల్లి జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి. మొన్నటివరకు 100 రూపాయలు తీసుకెళ్తే నాలుగైదు కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 5వందలు తీసుకెళ్లినా సంచి నిండడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కూరగాయలు మార్కెట్ లో అధిక రేట్లతో కొనుగోలు దారులు లేక కూరగాయల మార్కెట్ నిర్మానుషంగా మారింది. ఇటు గ్రామంలో జరిగే వార సంతలో కూడా కూరగాయలు ధరలు భగ్గుమంటంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో కూరగాయల ధరలు బాగా తగ్గిపోతాయి. కానీ, ఈ ఏడాది మాత్రం కూరగాయలు పేద, సామాన్య ప్రజలకు పెనుభారంగా మారాయి. ఏ కూరగాయ, అకుకూరలు చూసినా ధర షాక్ కొడుతున్నది. పొయ్యి మీద వేయకుండానే అంగట్లోనే ఉడికిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలు సామాన్యులను బెంబెలేత్తిస్తున్నాయి. ధరలు అమాంతం పెరగడంతో మార్కెట్‌లో అమ్మకాలు పడిపోయాయని, మరో పక్క కూరగాయల వ్యాపారులు వాపోతున్నారు. వేసవిలో కూరగాయల సాగు తగ్గి పోవడం, సాగు చేసిన పంటల్లో ఎండల కారణంగా దిగుబడులు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.