Vegetable Price Rise in Hyderabad : ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు..

Vegetable Price Rise Hyderabad : ఏం తినే తట్టు లేదు.ఏం కొనే తట్టులేదు అన్న పాటను ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ పాటలో చెప్పిన విధంగా సామాన్య ప్రజల పరిస్థితి మారిపోయింది.

Update: 2020-07-04 13:11 GMT

Vegetable Price Rise Hyderabad : ఏం తినే తట్టు లేదు.ఏం కొనే తట్టులేదు అన్న పాటను ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ పాటలో చెప్పిన విధంగా సామాన్య ప్రజల పరిస్థితి మారిపోయింది. పాటలో చెప్పినట్టుగానే వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్యుల జీవితాలను బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్ళి రేటు తెలుసుకుని రావడం తప్పితే కొనాలనే ఆశ కూడా చచ్చిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సగం సగం చాలి చాలని జీతాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలకు, ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, అలాగే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు పెరిగిన కూరగాయల ధరలు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

కొద్ది రోజుల ముందు వరకు వంద, రెండు వందలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి. కరోనా విస్తరిస్తున్న సమయంలో మధ్యతరగతి, పేద కుటుంబాల ప్రజల పెరగుతున్న నిత్యావసరాల ధరల ఖర్చును భరించలేకపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిన్నటి వరకు పనుల్లేక నానా తంటాలు పడిన కూలీలు కూరగాయల ధరలు ఆకాశన్నంటడంతో మూడు పూటలా తిండి తినలేని పరిస్థితి ఉంది. నిరుపేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక మండిపోతున్న కూరగాయల ధలరపై వ్యవసాయ మార్కటింగ్ శాఖ అధికారులు కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు వచ్చేవి. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా రావడం లేదు. ఇటు చూస్తే ప్రస్తుతమున్న సీజన్‌లో కూరగాయలు పండవన్నారు. ఆయా కారణాలతోనే కూరగాయల ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

గత నెల కూరగాయల ధరలు చూసుకుంటే జూన్‌లో కేజీ టమాటా రూ.18 ఉండగా ప్రస్తుతం రూ.60 ఉంది. కొన్నిచోట్ల రూ.75 కూడా విక్రయిస్తున్నారు. ఆలుగడ్డ, క్యారెట్‌, బీరకాయ, బీన్స్ ధర కూడా కేజీ రూ. 50 నుంచి 60 వరకు పలుకుతోంది. కానీ ఇప్పుడు వంద రూపాయలు తీసుకెళ్తే కనీసం మూడు కిలోల కూరగాయలు కూడా రావడంలేదు. మార్కెట్లో కిలో టమాటా ధరనే.. రూ. 60గా ఉంది. బీరకాయ ధరలు కూడా రూ.60 గానే ఉంది. ఇక బెండకాయ రూ. 40పైనే ఉంది. రైతు బజార్లతో పాటు కాలనీలో పెట్టిన వారంతపు మార్కెట్లలో కూడా కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. అటు ఆన్ లైన్ లో కూడా వెజిటేబుల్ ధరలు ఇలాగే ఉన్నాయి. 

Tags:    

Similar News