బీజేపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన బండి సంజయ్.. సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ తదితరులు
బీజేపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
Valmiki Jayanti: వాల్మీకిలను ఎస్టీ జాబితాలో కలుపుతామన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ‌్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడారు. రామాయణం అంటే మెదట గుర్తొచ్చేది వాల్మీకి మహర్షి అని, రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేసిన ఆది కవి వాల్మీకి మహర్షి అని సంజయ్ అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా అన్నివర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. వాల్మీకిలు కొట్లాడితే.. బీజేపీ అండగా ఉంటుందని, వాల్మీకి సమాజానికి సరైన గౌరవం, గుర్తింపు దక్కటం లేదన్నారు. వాల్మీకిలను అవమానిస్తే.. ఆ మహర్షిని అవమానించినట్లేనన్నారు.