Telangana: వనాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు

Telangana: అడవుల సంరక్షణకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం

Update: 2021-03-03 15:09 GMT

అర్బన్ పార్క్ (ఫైల్ ఇమేజ్)

Telangana: వనాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. సహజ అందాలకు వేదిక.. అలాంటి అడవులను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పట్టణాలకు సమీపంలో ఉన్న అడవులను ఎంపిక చేసి అర్బన్‌ పార్క్‌లుగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగానే మొదక్‌ జిల్లా నర్సాపూర్‌ అర్బన్ పార్క్ సరికొత్త అందాల వేదికగా మారింది. అలాంటి ప్రకృతి సోయగాలను అందిస్తున్న నర్సాపూర్ అర్బన్‌ పార్క్‌.

రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవులపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అధికారులను నియమించి కంటికి రెప్పాలా కాపాడుతోంది. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ అడవిని సంరక్షిస్తున్నారు అధికారులు. సుమారు 17వందల హెక్టార్లలో అడవిని పునరుద్ధరించారు. అంతేకాకుండా సుమారు రెండు వందల హెక్టార్లలో అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేశారు.

నర్పాపూర్ అడవి ఔషదాల ఖని. ఎన్నో ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి. వీటన్నింటినీ సేకరించి అడవిలో ఖాళీ ప్రదేశాల్లో పెంచుతున్నారు అధికారులు. ఇక కాలువలకు రెండు వైపులా వెదురు మొక్కలను నాటారు.

ఈ అడవిలో రకరకాల పక్షి జాతులున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు ఈ అడవి స్వర్గధామంగా నిలుస్తోంది. అర్బన్‌ పార్క్‌కు వచ్చే విజిటర్స్‌ కోసం అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే పక్కనే ఉన్నచెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేయాలని పర్యటకులు కోరుకుంటున్నారు

హైదరాబాద్‌కి అతిసమీపంలో ఉన్న నర్సాపూర్ అర్బన్ పార్క్ విజిటర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో అధికారులు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించే పనిలో పడ్డారు. మొత్తానికి హరితహారం పుణ్యమా అని అడవులకు కొంతలో కొంత్తైన మోక్షం కలుగుతోంది. 

Tags:    

Similar News