ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్‌ కలకలం

Adilabad: తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌ పొడిచి పరారైన దుండగులు

Update: 2022-10-20 06:55 GMT

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్‌ కలకలం

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్‌ కలకలం రేగింది. హరినాయక్‌ తండాలోని ఓ బస్టాప్‌లో నిల్చొని ఉన్న ఓ యువకుడికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పరారయ్యారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇంజెక్షన్‌ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని.. స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక.. మత్తు ఇంజెక్షన్‌ విషయం ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News