భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో విషాదం కరసాలబోడుతండాలో బాలుడిని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు బస్సు ఢీకొనడంతో బాలుడు దర్శిక్‌నాయక్ అక్కడికక్కడే మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి
చండ్రుగొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది.
స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరసాలబోడుతండలో చోటుచేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న భూక్య దర్శిక్‌నాయక్ అనే రెండేళ్ల బాలుడిని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బాలుడు దర్శిక్‌నాయక్ మృతితో కరసాలబోడుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న చండుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.