థియేటర్‌లో విషాదం.. OG సినిమా చూస్తుండగా ప్రేక్షకులపై పడిన స్పీకర్ బాక్స్

OG Screening: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓజీ సినిమా ప్రదర్శిస్తుండగా ఏషియన్ థియేటర్లో ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2025-09-25 06:18 GMT

OG Screening: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓజీ సినిమా ప్రదర్శిస్తుండగా ఏషియన్ థియేటర్లో ప్రమాదం చోటుచేసుకుంది. సౌండ్ బాక్స్ ప్రేక్షకులపైన పడటంతో ఇద్దరు ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు థియేటర్‌కు సామర్ధ్యానికి మించి అధిక శాతం ప్రేక్షకులను లోపలికి అనుమతించడంతో ప్రేక్షకులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యి ఆందోళన చెందారు.

ఇష్టానుసారంగా సామర్ధ్యానికి మించి అనుమతించడంతో ఇబ్బందులు పడ్డామని ప్రేక్షకులు తెలిపారు. మరోవైపు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా టికెట్లు కొనుగోలు చేయకుండా అనేక మంది థియేటర్‌ లోపలికి చొరబడ్డారు. దీంతో ప్రేక్షకులు మధ్య గొడవలు చెలరేగాయి. తీవ్ర గాయాలైన ఇద్దరు ప్రేక్షకులను ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News