టీఎస్ఆర్టీసీ బస్సులకు డీజిల్ భారం

*ఖమ్మంలో ప్రైవేట్ బంకులో డీజిల్ కోసం కిలోమీటర్ల మేర నిలిచిన బస్సులు

Update: 2022-02-23 04:00 GMT

టీఎస్ఆర్టీసీ బస్సులకు డీజిల్ భారం

Khammam: తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులకు డీజిల్ భారంగా మారింది. ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ బంకుల్లో డీజిల్ నింపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం పట్టణంలోని బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంకులో డీజిల్ పోయించేందుకు కిలో మీటర్ల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. అన్ని బస్సులు ఒకే బంకులో డీజిల్ విక్రయిస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. డ్యూటీ సమయం ముగిసినప్పటికీ డీజిల్ కోసం మూడు నుండి నాలుగు గంటలు అదనంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ఎండీ ఆదేశాలతోనే ప్రైవేట్ బంకుల్లో డీజిల్ కొనుగోలు చేస్తు్న్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయడంతో లీటరుకు మూడు రూపాయల వరకు ఆర్టీసీకి భారం తగ్గుతుందంటున్నారు. ఆయిల్ కార్పోరేషన్ నుండి ఆర్టీసీ బల్క్ గా డీజిల్ కొనుగోలు చేయడంతో ఆర్టీసీకి అదనంగా ఏడు రూపాయల భారం వెయ్యడంతో బయట డీజిల్ కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. మరో వైపు బంగారు తెలంగాణ అని చెబుతున్న ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో డీజిల్ నింపే పరిస్థితి లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Full View

 

Tags:    

Similar News