ప్రభుత్వం జారీ చేసే జీవోలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలి: హైకోర్టు

Dalita Bandhu Scheme: * దళితబంధు పథకంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు * పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం

Update: 2021-08-19 03:10 GMT

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలి

Dalita Bandhu Scheme: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలను 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ఇటీవల తెలంగాణ సర్కార్ ప్రారంభించిన దళితబంధు పథకంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దళిత బంధు పథకానికి నిబంధనలు ఖరారు చేయకుండానే వాసాలమర్రి గ్రామంలో లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారంటూ 'వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌' అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్ స్పందిస్తూ.. దళితబంధుకు నిబంధనలు ఖరారయ్యాయని, ఈ పథకం రాష్ట్రంలోని దళితులందరికీ వర్తిస్తుందని తెలిపారు. దీంతో పిటిషన్‌లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దళితబంధు పథకానికి సంబంధించిన నిబంధనల జీవోను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం విడుదల చేసే జీవోలన్నింటినీ 24 గంటల్లోగా వెబ్‌పైట్‌లో పెట్టి.. ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News