Ward Officers in Municipalities: మున్సిపాలిటీల్లో ఖాళీలు భర్తీ షురూ.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

Ward Officers in Municipalities: ప్రభుత్వ పాలన పారదర్శకంగా ప్రజల వద్దకే చేరాలంటే మధ్య వారధిలా పనిచేసే అధికారులు అవసరం. వీరు పూర్తిస్థాయిలో లేని పక్షంలో పాలకులు చేసిన ప్రణాళికలన్నీ వృధాగానే మిగిలిపోతాయి

Update: 2020-08-22 06:52 GMT

Ward Officers in Municipalities

Ward Officers in Municipalities: ప్రభుత్వ పాలన పారదర్శకంగా ప్రజల వద్దకే చేరాలంటే మధ్య వారధిలా పనిచేసే అధికారులు అవసరం. వీరు పూర్తిస్థాయిలో లేని పక్షంలో పాలకులు చేసిన ప్రణాళికలన్నీ వృధాగానే మిగిలిపోతాయి. ఈ విషయాన్ని గ్రహించిన తెలగాణా ప్రభుత్వం ముందు ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలతో పాటు కేబినేట్ ఆమోదించిన పోస్టులన్నీ తొందర్లోనే భర్తీ చేసి, పాలన మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రయత్నం చేస్తోంది.

పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రెషనలైజ్(హేతుబద్ధీకరణ) చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోనే మొద‌టి సారిగా...

పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి ఆలోచ‌న‌ల మేరకు రూపోదించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకి వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు అయన తెలిపారు. ఈమేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిధుధ్ద్యం, హారితహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహాదం చేస్తుందన్నారు.

భర్తీ అత్యంత పారదర్శకంగా..

ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్పూర్తితో ముందుకు పోయేందుకు వీలుకలుగుతుందన్నారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఎర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులంలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వీరికి సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు ఏస్.ఈలు కూడా ఉంటే ప్రతిపాదనలకు కూడా అమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News