కర్ణాటక హింస ఘటనపై స్పందించిన కేటీఆర్‌

కర్ణాటక హింస ఘటనపై స్పందించిన కేటీఆర్‌
x
కేటీఆర్ ఫైల్ ఫోటో
Highlights

KTR Responds Bengaluru Violence : తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కర్ణాటకలోని డీజే హాళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింస ఘటనపై స్పందించారు.

KTR Responds Bengaluru Violence : తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కర్ణాటకలోని డీజే హాళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింస ఘటనపై స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ను వేదికగా చేసుకున్న కేటీఆర్ సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియాను వాడుతున్న యూజర్లందరూ బాధ్యాతయుతంగా మెలగాలని కేటీఆర్ అభ్య‌ర్థించారు. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తిని అరికట్టాలని మంత్రి కోరారు. అనుచిత ప్రచారాలను సోషల్ మీడియాలో చేయొద్దని ఆయన కోరారు. సంఘ వ్యతిరేక కర్యకలాపాలకు సోషల్‌ మీడియా ఒక సాధనంగా మారొద్దని కేటీఆర్‌ సూచించారు.

ఉద్యాన నగరి బెంగళూరు ఒక్కసారిగా భగ్గుమంది. బెంగళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాంగ్రెస్ శాసన సభ్యుడి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. ఇంటికి నిప్పు పెట్టారు. దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. వాటిని నియంత్రించడానికి రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది. అదనపు బలగాలను తరలించాల్సి వచ్చింది.

ఇక ఈ విషయంపై నగర కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన ఓ పోస్ట్ ఈ అల్లర్లకు దారి తీసిందని ఆయన అన్నారు. అయితే ఒక వర్గానికి చెందిన కొందరు ఫిర్యాదు నవీన్ ను అరెస్ట్ చేయలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిని తగులబెట్టడం, దానికి అనుబంధంగా కేజీ హళ్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడి వాహనాలను నిప్పంటించిన ఘటనలో ఇప్పటిదాకా పోలీసులు 110 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేసారు. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్, అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామ్. ప్రస్తుతం పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నాయి. స్థానికులు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.




Show Full Article
Print Article
Next Story
More Stories