గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ నేడు కీలక భేటి

గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ ఇందుకోసం అవసరమైన పొలిటికల్ స్ట్రాటజీని రెడీ చేశారు.

Update: 2020-11-18 02:51 GMT

గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ ఇందుకోసం అవసరమైన పొలిటికల్ స్ట్రాటజీని రెడీ చేశారు. ఇవాళ పార్టీ నేతలతో శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

దుబ్బాక ఎన్నికల దెబ్బతో కాస్తా తేరుకున్న టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలన్నకసితో ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగకుండా స్ట్రాటజీని రూపొందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం... ఇందుకు సంబంధించిన వివరాలను నేతలకు ఇప్పటికే అందించారు.

ఇక ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరవ్వాలన్నారు. ఎన్నికల వ్యూహాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేసేలా ఈ సమావేశంలో పార్టీ నేతలకు సూచించనున్నారు సీఎం. ఐదేళ్లుగా నగరంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలతో ఎలా వ్యవహరించాలి, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశాలను వివరించనున్నారు.

గత ఎన్నికల్లో ఒక్కో డివిజన్లో ఒక్కో నేత బాధ్యత వహించగా.. ఈ సారి కూడా నేతలంతా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు కేసీఆర్‌. ఇప్పటికే సమావేశాలతో ఎన్నికల హడావుడిలో మునిగిపోయిన మంత్రులు.. ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించి ప్రచారాలు చేయాలని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో బల్దియాలో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్‌.. ఈసారి 104 స్థానాలు కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే శాసనసభా పక్ష సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News