Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nama Nageswara Rao: నామా కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్లు అటాచ్
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా కుటుంబానికి చెందిన 80 కోట్ల 65 లక్షల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా.. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం 28 స్థిరాస్తులు ఉన్నాయి. గతంలో కూడా 73 కోట్ల 74 లక్షలు ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట సుమారు 361 కోట్లకు పైగా రుణాలు తీసుకుని మళ్లించినట్లు.. ఈడీ గుర్తించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలను ఈడీ గుర్తించింది.