Peddapalli: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

ప్రాజెక్టు భూనిర్వాసితుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మేల్యే కోరుకంటి చందర్ అన్నారు.

Update: 2020-03-06 05:54 GMT

ఎల్లంపల్లి: ప్రాజెక్టు భూనిర్వాసితుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మేల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లిలో ఎల్లంపల్లి సమస్యలపై గురువారం ఆర్డిఓతో సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి భూర్వాసితులకు రావాల్సిన ఆర్ఎంఆర్ ప్యాకేజీ అందించాలన్నారు.

భూనిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలన్ని తొందరలో అందించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటిసిలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, సర్పంచ్ కోల లత ఉన్నారు.


Tags:    

Similar News