Etela Rajender: ఈటలకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్‌ వ్యూహం.. ఎల్‌.రమణను..

Etela Rajender: రెండుమూడు రోజుల్లో ఈటల టీఆర్ఎస్‌ పార్టీని వీడనున్నారు.

Update: 2021-06-08 06:35 GMT

Etela Rajender: ఈటలకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్‌ వ్యూహం.. ఎల్‌.రమణను..

Etela Rajender: రెండుమూడు రోజుల్లో ఈటల టీఆర్ఎస్‌ పార్టీని వీడనున్నారు. అయితే ఆయన స్థానంలో బలమైన బీసీ నేత కోసం గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అంతేకాదు ఈటల సొంత జిల్లా కరీంనగర్‌కు చెందిన టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్‌.రమణకు గాలం వేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. మాజీమంత్రి ఈటల బీజేపీలో చేరనుండటంతో ఆయనకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్‌ పావులు కదుపుతోంది. ఈక్రమంలోనే కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీమంత్రి, తెలంగాణ టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. రమణను గులాబీ గూటికి చేర్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఆరు గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కావాల్సి ఉంది. అయితే పద్మశాలి, విశ్వబ్రహ్మణ, కుమ్మరి సామాజిక వర్గాలకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్‌ హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పద్మశాలి కోటాలో రమణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈటల టీఆర్ఎస్‌ వీడిన క్రమంలో పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈక్రమంలోనే బలమైన బీసీ వర్గానికి చెందిన ఎల్‌.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. మరోవైపు రమణను చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. అటు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్‌ కూడా రమణతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మొత్తానికి గులాబీ పార్టీలో చేరేందుకు ఎల్‌.రమణ మొగ్గుచూపినప్పటికీ కేసీఆర్‌, కేటీఆర్‌ నుంచి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా రెండుమూడురోజుల్లో జగిత్యాల నియోజకవర్గంలోని సన్నిహితులు, కార్యకర్తలతో రమణ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Full View


Tags:    

Similar News