మమత సమావేశానికి టీఆర్ఎస్ దూరం
Mamata Meeting: *ఎవరూ హాజరు కావద్దని నిర్ణయం
మమత సమావేశానికి టీఆర్ఎస్ దూరం
Mamata Meeting: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఆ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. పార్టీ తరపున ఎవరూ పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించారు. ఢిల్లీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడంపై టీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన వైఖరిని తర్వాత వెల్లడించనుంది. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటించాలన్న అభిప్రాయం ప్రకటించింది.