NT Rama Rao Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ కు క్యూ కడుతున్న ప్రముఖులు
NT Rama Rao Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ కు క్యూ కడుతున్న ప్రముఖులు
NT Rama Rao Death Anniversary: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీపార్వతి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ చేపట్టిన కృషి ఎనలేనిదంటూ కొనియాడారు.
ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడే విధంగా బతుకుతున్న-లక్ష్మీ పార్వతి
29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గౌరవం కాపాడే విధంగా బతుకుతున్నానని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నా.. నందమూరి కుటుంబసభ్యురాలుగా చూడటం లేదని ఆవదన వ్యక్తం చేశారు. తనపై ఎందుకు కక్ష.. తానేమి తప్పు చేశానో అర్దం కావడం లేదన్నారు. తనపై జరుగుతున్న వేధింపులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన నారా లోకేష్, భువనేశ్వరి
ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ ఎన్టీరామారావుకు తల్లి భువనేశ్వరితో కలిసి నివాళలర్పించారు. సినీ రంగంలో ఎన్నో సినిమామాలు తీసి ఆయన మార్క్ చూపించారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బి్ం అందించారని.. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుజాతి ఎక్కడా ఉన్న అగ్రస్థానంలో ఎదగాలని లోకేష్ అన్నారు.
చరిత్రలో మరణం లేని నాయకుడు ఎన్టీఆర్-రఘురామకృష్ణరాజు
స్వర్గీయ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడంతో భారతరత్నకే గౌరవం వస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ స్వర్గీయ ఎన్టీఆర్ కు రఘురామ కృష్ణంరాజు నివాళులర్పించారు. చరిత్రలో మరణం లేని నాయకుడు దివంగత ఎన్టీఆర్ అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయంగా జీవించి ఉంటారని అన్నారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు.. సంక్షేమ పథకాలకు ఆధ్యుడని కొనియాడారాయన.
హైదరాబాద్ అభివృద్ధి చేయడంలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉంది-తీగల కృష్ణారెడ్డి
తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ జీవించి ఉంటారని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ ఎన్టీరామారావుకు తీగల కృష్ణా రెడ్డి నివాళలర్పించారు. తెలుగుజాతినే కాదు దేశం మొత్తం ఐక్యతగా ఉంచిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. నేషనల్ ప్రింట్ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎంతమందికి ఎన్టీఆర్ రాజకీయ బిక్ష పెట్టారని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అడుగుజాడ నడుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధి చేయడంలోనూ ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉందన్నారు.