Telangana: ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాద్రి జిల్లాకు గిరిజనుల వలస

Telangana: ఏజెన్సీ ప్రాంతం గుండ్లమడుగులో నివాసాల ఏర్పాటు * ఆకులు, అలములు, అడవిలో గడ్డలు తింటూ జీవనం

Update: 2021-02-24 10:02 GMT

ఫైల్ ఇమేజ్


Telangana: రకరకాల కూరలు లేనిదే మనకు ముద్ద మింగుడు పోదు. అలాంటిది గడ్డి కూర ఉంటే చాలు ఆ గిరిజన గ్రామ ప్రజలు విందు పండగ చేసుకుంటారు. వారంలో నాలుగు రోజులు గడ్డి కూరనే తినడంతో పాటు పచ్చడి సైతం చేసుకొని ఎంచక్కా భోంచేస్తుంటారు. అంతటితో ఆగకుండా గడ్డిని ఎండబెట్టి పొడి చేసుకొని రోజు నీటిలో కలుపుకొని తాగేస్తుంటారు అక్కడి గ్రామ ప్రజలు.

పదేళ్ళ కిందట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం కొత్తూరుకు కొంతమంది గిరిజనులు వలస వచ్చారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండ్లమడుగు గ్రామంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆకులు, అలములు, అడవిలో గడ్డలు తిని జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే కరోనాతో నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వాగులు, వంకలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొలిచే ML అనే గడ్డి మొక్కను ఇక్కడి గిరిజనులు ఇష్టంగా తింటారు. ముందుగా ML గడ్డి మొక్కను కోసి, శుభ్రంగా కడిగి, ఎండబెట్టి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి, కూర వండుకొని ఆహారంగా స్వీకరిస్తున్నారు. అంతేకాదు.. ఆ ఎండబెట్టిన కూరను పొడిగా చేసుకొని అందులో కొన్ని టమాటాలు వేసి పచ్చడి చేసుకొని కూడా భుజిస్తుంటారు. గడ్డి మొక్కను ఎండబెట్టకుండా పచ్చి కూర తింటే.. గొంతులో దురద వస్తుందని అంటున్నారు గిరిజనులు.

ఇక ఈ ML గడ్డి మొక్కలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని గిరిజనుల నమ్మకం. దీనివల్ల ఎలాంటి రోగాలు తమ దరిదాపుల్లోకి కూడా రావని గిరిజనులు చెబుతున్నారు. ఎలాంటి రోగమైనా ఇట్టే నయం అవుతుందని అంటున్నారు. అయితే గడ్డి మొక్కను తిని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. మొత్తానికి కక్కా, ముక్కా తింటున్న ఈ రోజుల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మొలిసే గడ్డిని తింటూ అందరినీ షాక్‌కు గురిచేస్తున్నారు గిరిజనులు.

Tags:    

Similar News