మంచిర్యాల జిల్లా ఎర్రాయిపేటలో విషాదం.. గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

*మంచిర్యాల జిల్లా ఎర్రాయిపేటలో విషాదం.. గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

Update: 2022-10-24 06:06 GMT

మంచిర్యాల జిల్లా ఎర్రాయిపేటలో విషాదం.. గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు అయ్యారు. దీపావళి సెలవులుకావడంతో ముగ్గురు ప్రైవేట్ స్కూల్ టీచర్లు గోదావరి స్నానానికి వెళ్లారు. ఎర్రాయిపేట గ్రామం వద్ద గోదావరి నదిలో ఈతకు దిగగా లోతు ఎక్కువగా ఉండటం... నది ప్రవాహంతో ఇద్దరు నీట మునిగి గల్లంతయ్యారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. గల్లంతైన ఇద్దరు చెన్నూరు పట్టణానికి చెందిన అస్సిసి క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌కు చెందిన టీచర్లుగా గుర్తించారు. ఫైర్, గజ ఈతగాళ్లతో పోలీసులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News