కామారెడ్డి జిల్లాలో విషాదం.. సెల్‎టవర్‎పై రైతు ఆత్మహత్య..

Kamareddy: నేలతల్లిని నమ్ముకున్నాడు.. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాడు.

Update: 2022-12-05 11:57 GMT

కామారెడ్డి జిల్లాలో విషాదం.. సెల్‎టవర్‎పై రైతు ఆత్మహత్య..

Kamareddy: నేలతల్లిని నమ్ముకున్నాడు.. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాడు. ఆరుగాలం కష్టించి పంట సాగు చేశాడు. అయితే అధికారుల అలసత్వంతో చెరువు నీరంతా తన పొలంలో పారుతుండటంతో అతని కష్టమంతా నీటిపాలవుతోంది అధికారుల చుట్టూ తిరిగాడు. పంట నష్టపోయాను పరిహారం ఇప్పించండి మహాప్రభో అని వేడుకున్నారు అయినా అధికారులు స్పందించ లేదు. చేసిన అప్పులు తీర్చలే.. పేదరికలో కుటుంబాన్ని పోషించలేక నరకయాతన అనుభివించాడు. ఇక ఫలితం లేదనుకున్నాడు. సెల్ టవర్ఎక్కి ఉరేసుకుని తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ పైనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కన్నీరు పట్టిస్తోంది.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకన్న ఘటన అందిరినీ కంటతడి పెట్టిస్తోంది. పుట్ట ఆంజనేయులుకు గ్రామ చెరువు ఆయకట్టు పరిధిలో కొంత భూమి ఉంది. ఆభూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా కొంతకాలంగా ఆభూమిలో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే గతకొన్ని నెలలుగా అప్పలు చెసి మరీ తన పొలంలో పంట సాగు చేస్తున్నాడు. అయితే చెరువులోంచి పొలాలకు వచ్చే నీరంతా తన పంట పొలం నుంచే వెళ్తుండటంతో ఆంజనేయులు పొలంలోని పంట చేతికందకుండా పోతోంది.

దీంతో తన పంటకు జరిగని నష్టానికి పరిహారం ఇవ్వాలని గతకొన్ని రోజలుగా అధికారుల చుట్టూ తిరుగుతు ప్రాదేయపడ్డాడు. అయినప్పటికీ అధికారులెవరూ రైతు ఆంజనేయులు వినతిని పట్టించుకోకపోవడంతో చేసిన అప్పులు ఏలా తీర్చాలో తెలియక, కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అధికారుల తీరుకు నిరసనగా సెల్‎టవర్‎పై రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య.. ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Tags:    

Similar News