KCR: పోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు?

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

Update: 2026-01-29 06:45 GMT

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులను వేటాడుతున్న ప్రత్యేక విచారణ బృందం (SIT), తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR)పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

నేడే ఎర్రవల్లి ఫాంహౌస్‌కు అధికారులు?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈరోజు సిట్ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్‌కు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం. ఈ నోటీసుల ద్వారా రేపు (శుక్రవారం) ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ను విచారించనున్న సిట్:

ఇప్పటికే ఈ కేసులో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ నోటీసులు అందితే, రేపు సిట్ అధికారుల ముందు కేసీఆర్ హాజరవుతారా? లేక న్యాయ నిపుణుల సలహాతో తదుపరి అడుగులు వేస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి కేసులో నోటీసులు అందడం ఇదే తొలిసారి కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.

Tags:    

Similar News