Jupally Krishna Rao: హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్: ‘వాటాలపై చర్చకు సిద్ధమా?
Jupally Krishna Rao: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.
Jupally Krishna Rao: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు పంచుకున్న వాటాలపై చర్చలకు సిద్దమా అని మంత్రి జూపల్లి హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఈ రెండేళ్లలో బ్రూవరీలకు సంబంధించి కొత్త చట్టం తీసుకోరాలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన నిబంధనలే ఇప్పటికీ అమలౌతున్నాయన్నారు.
అవగాహాన రాహిత్యంతో హరీష్ రావు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పలన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఆ మరక తమకు అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా బకాయిలు చెల్లిస్తే.. ఇన్నివేల కోట్లు బాకాయిలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.