TG ICET 2026: టీజీ ఐసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 13,14న పరీక్షలు
TG ICET 2026: టీజీ ఐసెట్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, మే 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు.
TG ICET 2026: టీజీ ఐసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 13,14న పరీక్షలు
TG ICET 2026: తెలంగాణ ఐసెట్ (TG ICET)–2026 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించనున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఐసెట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది.
టీజీ ఐసెట్–2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 16 వరకు ఫీజు లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.750, కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.550గా నిర్ణయించారు.
టీజీ ఐసెట్–2026 రాత పరీక్షలను మే 13, 14 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్ విడుదలతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.