Medaram Jatara 2026: మేడారం జాతర సమ్మక్క రాకకు ముందు గద్దెపై వనం ప్రతిష్ట

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో సమ్మక్క తల్లి రాకకు ముందు గిరిజన భక్తులు సంప్రదాయబద్ధంగా వనం (వెదురు కర్రలు) గద్దెపై ప్రతిష్టించారు.

Update: 2026-01-29 11:00 GMT

Medaram Jatara 2026: మేడారం జాతర సమ్మక్క రాకకు ముందు గద్దెపై వనం ప్రతిష్ట

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో కీలక ఘట్టం పూర్తయింది. నిన్న రాత్రి సారలమ్మ గద్దెకు చేరుకోగా, నేడు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి గద్దెల వద్దకు రానుంది.

సమ్మక్క తల్లి రాకకు ముందు సంప్రదాయబద్ధంగా వనం (వెదురు కర్రలను) గద్దెపై గిరిజన భక్తులు ప్రతిష్టించారు. మేడారం జాతరలో వనం కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆదివాసీ భాషలో ‘వనం’ అంటే అడవి అని అర్థం. సమ్మక్క, సారలమ్మ తల్లులు అడవుల నుంచి గద్దెలపైకి వచ్చే సంప్రదాయానికి గుర్తుగా ఈ వనం ప్రతిష్టిస్తారు.

ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఏపుగా ఎదిగిన వెదురు కర్రను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క గద్దెల వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. వనం గద్దెపై ప్రతిష్టించిన తరువాతే చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ కార్యక్రమంతో మేడారం జాతరలో భక్తుల సందడి మరింత పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిజన భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News