Tragedy in Bhonagiri: కరోనా వేళ.. కన్నతల్లిని నడి రోడ్డుపై వదిలేసి కొడుకు

Tragedy in Bhonagiri: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు బిడ్డలు చేదోడు వాదోడుగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకులే వారిని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు.

Update: 2020-07-06 07:26 GMT

Tragedy in Bhonagiri: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు బిడ్డలు చేదోడు వాదోడుగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకులే వారిని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. బుక్కెడన్నం కూడా పెట్టకుండా ఆకలికి అలమటించేలా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. వృద్దాప్యంలో ఉన్న కన్న తల్లికి బుక్కెడు అన్నం కూడా పెట్టకుండా రోడ్డుపై వదిలేసిన సంఘటన భువనగిరి లో చోటు చేసుకుంది. ఈ సంఘటనకి సంబంధించి పూర్తివివరాల్లోకి వెళ్తే 77 ఏళ్ల కిష్టమ్మ ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడెం సమీపంలో నివాసం ఉంటున్నారు.

కాగా ఆ వృద్దురాలు గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతొ ఆమె కుమారుడు ఆమెకు చికిత్స అందించడం కోసం ఐదు రోజుల క్రితం భువనగిరి  లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆమె ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో ఆదివారం కొడుకు కోడలు ఇంటికి తీసుకెళతాం అని చెప్పి భువనగిరి కొత్త బస్టాండ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తరువాత కిష్టమ్మ దగ్గరున్న రూ.40 వేలు తీసుకున్న కొడుకు కోడలు భువనగిరి కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆమెను రోడ్డు మీద వదలి వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ వృద్ధురాలు బస్టాండ్ సమీపంలో ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది.

ఈ వృద్దురాలి పరిస్థితిని చూసిన అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు కిష్టమ్మకు భోజనం అందజేశారు. ఇప్పటికీ ఆమె బస్టాండ్ దగ్గర్లోనే ఉన్న నాలుగు చక్రాల బండి కిందే తలదాచుకుంది. ఓవైపు కరోనా మహమ్మారి పంజా విసరుతున్న వేళ.. కన్నతల్లిని అంత కర్కశంగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిన ఆ కొడుకు పట్ల స్థానికులు మండి పడతున్నారు. ఆమెను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News