Pragathi Bhavan: రేపు ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం

Pragathi Bhavan: సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకంపై అఖిలపక్ష భేటీ

Update: 2021-06-26 01:25 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Pragathi Bhavan: తెలంగాణలో మరో కొత్త పథకం రాబోతోంది. అయితే ఆ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం విధి విధానాల రూపకల్పనలో భాగంగా రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించనున్నారు. సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకంపై అఖిలపక్ష భేటీ జరుగనుంది. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం 'సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌' పథకానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో భాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల శాసనసభాపక్ష నేతలు హాజరవుతారు. సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపాలని ఇప్పటికే ఆయా పార్టీ అధ్యక్షులకు సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర నాయకులను సమావేశానికి ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం అభివృద్ధికోసం పాటుపడుతుందని కేసీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం కూర్చోని మరింత క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

Tags:    

Similar News