Yadadri Sri Laxmi Narasimha Swami Temple : యాదాద్రిలో 6నెలల తరువాత ఆర్జిత సేవలు ప్రారంభం

Update: 2020-10-04 07:50 GMT

Yadadri Sri Laxmi Narasimha Swami Temple : కరోనా మహమ్మారి కారణంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 22 నుంచి ఆర్జిత సేవలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో సుమారుగా 196 రోజుల తర్వాత ఆలయ పూజారులు ఆర్జిత సేవలు పున:ప్రారంభించారు. ఈ సేవలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభించారు. నేటి నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులకు స్వామివారికి ఇచ్చే తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. ఇక ఆర్జిత సేవలు ప్రారంభం అయిన క్రమంలో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులను అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారి ఆర్జిత సేవలు ప్రారంభం అవడంతో పాటు యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు ఈవో వెల్లడించారు. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 9.45గంటల వరకు నిత్య కైంకర్యాలను కొనసాగిస్తామని తెలిపారు. అలాగే ఆలయ దర్శన వేళలను మార్పు చేసినట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి భక్తుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. అదే విధంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాల ఆలయంలో నిత్య కైంకర్యములు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక యాదాద్రి కొండకు వచ్చే భక్తులు ఉండడానికి కొండ కింద గల తులసీ కాటేజీలో సైతం ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికే గదులు కేటయిస్తామన్నారు.

Tags:    

Similar News