"తెలంగాణలో సాగుతోంది రజాకార్ల పాలన!" ఓవైసీ డైరెక్షన్‌లోనే రేవంత్ సర్కార్.. బీజేపీ నేతల సంచలన ఆరోపణలు

Ramchandra Rao: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ అగ్రనేతలు నిప్పులు చెరిగారు.

Update: 2026-03-09 09:46 GMT

"తెలంగాణలో సాగుతోంది రజాకార్ల పాలన!" ఓవైసీ డైరెక్షన్‌లోనే రేవంత్ సర్కార్.. బీజేపీ నేతల సంచలన ఆరోపణలు

Ramchandra Rao: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ అగ్రనేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు రేవంత్ రెడ్డి పాలన సాగుతుందా లేక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తోందా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజాపాలన కాదని, అది రజాకార్ల పాలనను తలపిస్తోందని విమర్శించారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీ అనుమతి తీసుకుంటున్నారని ఆరోపించారు. "తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా? ప్రభుత్వం నడుస్తోంది ప్రజల కోసమా లేక ఓవైసీ కోసమా?" అని ఆయన నిలదీశారు.

బండి సంజయ్ ప్రశ్నలు: నిధుల మళ్లింపుపై ఫైర్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి మాటలు పూటకో రకంగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడానికి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం.. ఓవైసీ ఒక్క పిలుపు ఇవ్వగానే మూసీ ప్రాజెక్ట్ కోసం వేల కోట్లు ఎక్కడి నుండి సమీకరిస్తుందని ప్రశ్నించారు.

దళితులు, గిరిజనులకు ఇచ్చేందుకు భూమి లేదంటూనే.. జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంతాల వారికి భూములిస్తామని హామీలు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. పాత బకాయిలు చెల్లించకుండా ఉచిత ఈవీ (EV) స్కూటీలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.

Tags:    

Similar News