Kavitha: ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్!

Kavitha: ఖమ్మం జిల్లా కేంద్రంలోని జడ్పీ సెంటర్ సోమవారం ఉద్రిక్తతకు వేదికైంది. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2026-03-09 12:07 GMT

Kavitha: ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్!

Kavitha: ఖమ్మం జిల్లా కేంద్రంలోని జడ్పీ సెంటర్ సోమవారం ఉద్రిక్తతకు వేదికైంది. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాసితులతో కలిసి ఆమె చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్టులు చేపట్టారు.

వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన భూదాన్ భూముల నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరం గుండా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం, నిర్వాసితులు తమ నిరసనను ఉధృతం చేశారు.

ర్యాలీ అనంతరం ఆందోళనకారులు జడ్పీ సెంటర్ వద్దకు చేరుకుని రాస్తారోకోకు దిగారు. రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News