నేటి నుంచి యాదాద్రి ఆలయంలో భక్తులకు అనుమతి

X
Highlights
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నాడు....
Arun Chilukuri12 Sep 2020 4:50 AM GMT
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఆలయంలో నేటి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. అయితే నేటి నుంచి యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అనుమతిస్తున్నారు.
Web Titledevotees allowed to Lakshmi Narasimha Temple from today
Next Story