Haritha Haram: పుడమి పులకరించేలా... ప్రకృతి పరవశించేలా... హరితహారం

Haritha Haram: పంచభూతాలకు పూజానివేదన.. తెలంగాణ ప్రజల సుభిక్షత

Update: 2023-06-20 03:33 GMT

Haritha Haram: పుడమి పులకరించేలా... ప్రకృతి పరవశించేలా... హరితహారం

Haritha Haram: పుడమి పులకరించేలా. ప్రకృతి పరవశించేలా. హరితహారం పథకం రాష్ట్రంలో విప్లవాత్మమైన మార్పునకు కాణమని రవాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ పునర్ నిర్మాణ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారని మంత్రి అజయ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో LB నగర్‌, NSP కెనాల్ WALKWAY గట్టు పొడవునా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ మొక్కలు నాటారు.

అటవీ శాఖ అధ్వర్యంలో వెలుగుమట్ల ఫారెస్ట్ రేంజ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ. రాష్ట్రం పచ్చల హారంలా మారాలనే ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దశాబ్దాల కాలాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను, బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు కేసీఅర్ నడుం కట్టారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చారని వివరించారు.

కేసీఅర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల 6శాతం అడవులు వృద్ధి చెందాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. కెనడాలో ప్రతి మనిషికి 8,953 చెట్లున్నాయని తెలిపారు. రష్యా 4,461, ఆస్ట్రేలియా 3,266, బ్రెజిల్ 1,494, యునైటెడ్ స్టేట్స్ 716 ఫ్రాన్స్ 182, యుకే 47 ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి మనిషికి 422 ఉన్నాయని గణాంక వివరాలు వెల్లడించారు.

చెట్లను కన్న పిల్లలు లాగా చుస్కోవల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. చెట్లే ఈ సృష్టికి జీవనాధారం అని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఅర్, హరితహారం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రతి ఏడాది ప్రతి ఒక్క పౌరులను భాగస్వాములను చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటని, మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన. పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది అని అన్నారు.

ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దక్కిందనన్నారు.

తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలో ప్రతీ ఒక్కరికీ అర్దం అయ్యేలా వివరించడంలో ముఖ్యమంత్రి సఫలం అయ్యారు.

ఆ కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయని, ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు.

హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచాయని, ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలని పేర్కొన్నారు.

మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలని, ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటడంజరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు చేశామని, హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI) - స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం 2015-21 మధ్య రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం 6.85 పెరిగిందని తెలిపారు.

ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి, సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కార్పొరేటర్లు , అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News