Congress: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ
Congress: విష్ణు వ్యతిరేకవర్గంతో అజారుద్దీన్ సమావేశం
Congress: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ
Congress: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి వ్యతిరేకవర్గం భేటీ అయింది. విష్ణు వ్యతిరేకవర్గంతో అజారుద్దీన్ భేటీ అయ్యారు. విష్ణు ప్రధాన అనుచరుడు భవానీ శంకర్‌తో అజారుద్దీన్ భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతానని ఇప్పటికే అజారుద్దీన్ ప్రకటించారు. తన విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారుద్దీన్ పాల్గొన్నారు. గతంలోనూ విష్ణువర్దన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా.. అజారుద్దీన్ జూబ్లీహిల్స్‌లో పర్యటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. ఈ అంశంపై థాక్రే కూడా స్పందించి, అజారుద్దీన్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు తాజాగా మరోసారి విష్ణువర్దన్ వ్యతిరేక వర్గంతో అజారుద్దీన్ భేటీకావడం హాట్‌టాపిక్‌గా మారింది.