Rewind 2025: రేవంత్ ల‌క్కీ ఇయ‌ర్@ 2025.. వ‌రుస విజ‌యాల‌తో పెరిగిన‌ రేవంత్ గ్రాఫ్

Rewind 2025: 2025 సంవ‌త్సరం తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చిందా అంటే అవుననే చెప్పాలి. తొలి ఏడాది... త‌డ‌బ‌డినా... ఈ ఏడాది వ‌చ్చిన విజ‌యాలు సీఎం రేవంత్ కు రాజ‌కీయంగా ఐదేళ్ళ శ‌క్తినిచ్చాయి.

Update: 2025-12-30 06:08 GMT

Rewind 2025: 2025 సంవ‌త్సరం తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చిందా అంటే అవుననే చెప్పాలి. తొలి ఏడాది... త‌డ‌బ‌డినా... ఈ ఏడాది వ‌చ్చిన విజ‌యాలు సీఎం రేవంత్ కు రాజ‌కీయంగా ఐదేళ్ళ శ‌క్తినిచ్చాయి. ప‌రిపాల‌న‌పై ప‌ట్టు పెంచుకుంటూ.... పాలిట్రిక్స్ తో ప్రత్యర్థుల‌తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు రేవంత్. పార్టీ గ్రాఫ్ ను... సొంత ఇమేజ్ ను గ్లోబ‌ల్ రేంజ్ ను పెంచుకున్న రేవంత్ రైజింగ్ తెలంగాణ విజన్ 2047 పాలసీ ముందుంచి దూసుకుపోతున్నారు. ఐతే గడిచిన ఈ ఏడాది 2025 ప్రభుత్వ పనితీరు, రేవంత్ జ‌ర్నీపై hmtv స్పెషల్ రిపోర్ట్.

తెలంగాణకు రెండో ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డికి... త‌న రెండో ఏడాది పాల‌న క‌లిసొచ్చింది. తొలి ఏడాదిలో రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న రేవంత్ కు... 2025 బాగా దైర్యం ఇచ్చింది. ఈ ఏడాదిలో వ‌చ్చిన విజ‌యాలు... రేవంత్ కు ఐదేళ్ళ‌కు స‌రిపడా రాజ‌కీయ శ‌క్తి నిచ్చాయి. దీంతో... సీఎం గా రేవంత్ నిల‌దొక్కుకోగ‌ల‌రా... అనుకున్న వాళ్ళకు... ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ త‌ప్పా..! వెరొక‌రు క‌నించ‌ని స్థాయికి చేరేలా... రేవంత్ రెడ్డికి 2025 దిక్సూచిలా మారింది.

గాడిత‌ప్పిన ఆర్తిక వ్య‌వ‌స్త‌ను స‌రిదిద్దుకుంటూ... సంక్షేమ , అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.... ప‌రిపాల‌న‌లో సైతం త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్నారు. ఆదాయాన్ని పెంచ‌డం .. పేద‌ల‌కు పంచ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్న రేవంత్ కు ... ఈ ఏడాది ప్రారంభించిన సంక్షేమ పథ‌కాలు... స‌క్సెస్ ను ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ ఏడాదే. అంతేకాదు... గ‌డిచిన ఐదేళ్ళుగా పేద‌లు ఎదురుచూస్తున్న రేష‌న్‌కార్డులు పేద‌ల‌కు అందించింది రేవంత్ స‌ర్కార్. దీనితో పాటు... దేశంలో ఎక్క‌డా లేనివిధంగా... రేష‌న్ షాపుల్లో పేద‌ల‌కు స‌న్న‌బియ్యం అందించింది స‌ర్కార్. దీనితోపాటు... ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామిని నిల‌బెట్టుకుంటూ...ప్ర‌తి ఎక‌రాకు 12 వేల రైతు భ‌రోసా, స‌న్న వ‌డ్ల‌కు క్వింటాకు 500బోన‌స్ అందించింది స‌ర్కార్. గుంట పొలం లేని కూలీల‌కు ఇందిర‌మ్మ అభ‌య హ‌స్తం అందించింది. వీటితోపాటు... కోటి మంది మహిళలకు చీరలు అందించింది. ఈ ఏడాది రేవంత్ స‌ర్కార్ అమ‌లు చేసిన సంక్షేమ మంత్రం ప్ర‌జ‌ల్లో సర్కార్ గ్రాఫ్ ను పెంచింది.

ఈ ఏడాదిలో జరిగిన ఉప ఎన్నిక‌ల నుంచి... గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు.. అన్నింటా విజ‌యం వ‌రించ‌డం రేవంత్ కు పొలిక‌టిల్ గా బూస్ట్ నిచ్చింది. ఈ ఏడాది మొద‌ట్లో జ‌రిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపుతో... 2025 గ్రాండ్ వెల‌కమ్ చెప్పిన రేవంత్.... జూబ్లిహిల్స్ బైపోల్ గెలుపుతో... ప్ర‌తి పక్షానికి షాక్ ఇచ్చారు. ఇటీవల పంచాయ‌తి ఎన్నిక‌ల్తో .. రాష్ట్ర వ్యాప్తంగా 66 శాతం స‌ర్పంఛ్ ల‌ను గెలిపించుకుని... పొలిటిక‌ల్ మ్యాజిక్ చేశారు. దీంతో ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌తో... క్షేత్రస్థాయిలో దెబ్బ‌తిన్న పార్టీకి క్యాడ‌ర్ కు... సర్పంచ్ ల‌తో రాజ‌కీయంగా బ‌ల‌మైన పునాది వేశారు రేవంత్ రెడ్డి. ఈ వ‌రుస విజ‌య‌లతో.... తిరుగు లేద‌నుకున్న బిఆర్ఎస్ ను ఓడించి డిఫెన్స్ లోకి నెట్టారు రేవంత్ రెడ్డి.

ఇక ప‌రిపాన‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. గ‌త స‌ర్కార్ లో భూ స‌మ‌స్య‌ల‌కు కేంద్రంగా ఉన్న ధ‌ర‌ణి స్థానంలో భూ- భార‌తిని తీసుకువ‌చ్చింది ప్ర‌భుత్వం. క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ తో... అధికారుల‌కు స‌ర్కార్ ల‌క్ష్యాలు వివ‌రిస్తూ వారిని అల‌ర్ట్ చేస్తున్నారు. అంతేకాదు... గ‌తేడాది వాయిదాల‌కు పరిమిత‌మైన కేబినెట్ విస్త‌ర‌ణ‌ను పూర్తి చేశారు. ఏకంగా వివేక్, అడ్లూరి ల‌క్ష్మ‌న్, వాకిటి శ్రీహ‌రి, అజారుద్దీన్‌ను కెబినెట్ లోకి తీసుకున్నారు. సామాజిక సమీకణాలతో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇంకా పెండింగ్ లో ఉన్న రెండు బెర్త్ ల‌ భ‌ర్తీపై సీరియ‌స్ గా దృష్టి పెట్టిన‌ప్ప‌టికి..... హైక‌మాండ్ నిర్ణ‌యంతో... చివ‌రి క్ష‌ణంలో ఆగిపోయింది. ఇక ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దావోస్ వేదిక‌గా... ఏకంగా ల‌క్ష 79 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌ను తీసుకువ‌చ్చి కొత్త రికార్డ్ సృష్టించారు రేవంత్. అంతే కాకుండా గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా.. మ‌రో 5 ల‌క్ష‌ల‌75 వేల కోట్ల పెట్టుబ‌డుల‌కు ఎం వోయూ లు కుదిర్చికుంది.

ప్ర‌పంచానికి తెలంగాణ మోడ‌ల్ ను ప‌రిచ‌యం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న రేవంత్ రెడ్డి... అభివృద్దిలో తెలంగాణ‌ను చైనా ప్ల‌స్ ఒన్ నిలుపుతామంటున్నారు. దీనికి అనుగుణంగా... హైద‌రాబాద్ లో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఈ ఏడాదిలోనే. మెట్రో విస్త‌ర‌ణ తోపాటు... మూసీ డెవ‌ల‌ప్ మెంట్ కారిడార్‌తో.... కాలుష్య కాసారంగా ఉన్న మూసీకి ... కొత్త చ‌రిత్ర రాయాల‌ని డిసైడ్ అయ్యారు. మూసీ కారిడార్ ను... అభివృద్ధి కి కేంద్రంగా.... మార్చి... ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. త్వ‌ర‌లోనే....బాపు ఘాట్ దగ్గ‌ర‌.... అతి ఎత్తైన మ‌హాత్మా గాంధీ విగ్ర‌హ ఏర్పాటుకు సిద్దం అవుతుంది. ఇక న్యూయార్క్ , టోక్యో లకు దీటుగా.... ఫోర్త్ సిటీగా ఫ్యూచ‌ర్ సీటి నిర్మాణానికి పునాది రాయి వేశారు రేవంత్ రెడ్డి. రాజ‌ధాని శివారులోని బేగ‌ర కంచలో... 30 వేల ఎక‌రాల్లో జీరో నెట్ సీటిని నిర్మించ‌నుంది.. ఇప్పటికే ఈ ఫ్యూచర్ సిటీలోకి దిగ్గ‌జ కంపెనీల రాక మొద‌లైంది. ఇక్క‌డ ఏఐ హ‌బ్, స్పోర్ట్స్ హ‌బ్ , స్కిల్ యూనివ‌ర్సిటి, ఐటీ , ఫార్మా, బ‌యో... ఇలా ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఫ్యూచర్ సిటిని తీర్చిదిద్దాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. అంతేకాదు... ఇదే ఫ్యూచ‌ర్ సీటి వేదిక‌గా.... తెలంగాణ రైజింగ్ 2047 .. గ్లోబల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించింది స‌ర్కార్. ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీలను స‌మ్మిట్ కు ర‌ప్పించింది. స‌మ్మిట్ వేదిక‌గా.... భవిష్య‌త్ తెలంగాణ కోసం.... తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ డాక్యూమెంట్ ను ఆవిష్క‌రించారు రేవంత్ రెడ్డి. ఈ విజ‌న్ డాక్యూమెంట్ తో..... రేవంత్ త‌న గ్లోబ‌ల్ ఇమేజ్ పెంచుకున్నారు.

ప్ర‌పంచ ఫుట్ బాల్ లెజెండ్ .. లియోన‌ల్ మెస్సితో... క‌ల‌సి ఫుట్ బాల్ ఆడ‌టం... రేవంత్ స‌రికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యువ‌త‌లో.... రేవంత్ ప‌ర్స‌న‌ల్ గ్రాఫ్ ను పెంచింది. ఇలా .... మెస్సీతో క‌ల‌సి ఫుట్ బాల్ గేమ్ ఆడి... దేశవ్యాప్తంగా.... పాలిటిక్స్ లో సైతం... క్రేజి స్టార్ నిలిచారు రేవంత్ రెడ్డి. ఇక గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆడ‌ట‌మే కాదు... ప్ర‌తిప‌క్షాల‌తో... ఈ ఏడాది రేవంత్ పోలిటిక‌ల్ గేమ్ లో దూకుడును ప్ర‌ద‌ర్శించారు. దేశంలో ద‌శాబ్దాల డిమాండ్ గా ఉన్న మాదిగ రిజ‌ర్వేష‌న్ ల‌ను అమ‌లు చేసిన తొలి రాష్టంగా నిలిపారు రేవంత్. అంతేకాదు... స్వాతంత్ర్య అనంత‌రం బీసీ కుల‌గ‌ణను.. అది కూడా శాస్త్రీయంగా చేసింది రేవంత్ స‌ర్కార్. బీసీల‌కు స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేషన్లను ప్ర‌క‌టించింది. అయితే రిజ‌ర్వేష‌న్ అంశం కోర్ట్ తీర్పుతో ఆగి పోయిన‌ప‌స్ప‌టికి... రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షాల‌ను మాత్రం డిఫెన్స్ లోకి నెట్టారు రేవంత్ రెడ్డి. ఇక ముఖ్య‌మంత్రి హోదాలో గ‌తంలో ఏ సీఎం చేయ‌ని విధంగా... ఏకంగా ఓయూ ఆర్ట్ కాలేజీ ముందు స‌భ‌ను నిర్వ‌హించి... యూనివర్సిటీ అభివృద్ధికి ఏకంగా వెయ్యి కోట్లు మంజూరు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇక గ‌త స‌ర్కార్ తో చేసిన త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో సాహ‌సోపేతంగా ముందుకు వెళ్లారు రేవంత్. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు కుంగుబాటు... ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన‌ అవినీతి, అక్ర‌మాల‌పై కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌డం ... ఆ క‌మిష‌న్ సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌...... ప్ర‌భుత్వానికి నివేదికక ఇచ్చింది ఈ ఏడాదే. కాళేశ్వ‌రంపై విజిలెన్స్, ఎన్ డిఏఎస్ రిపోర్ట్ లు సైతం ఇచ్చింది ఈ సంవ‌త్స‌రంలోనే. ఈ నివేదిక‌లు తీసుకున్న త‌ర్వాత‌.... కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ CBIకి అప్పగించి.. పొలిటిక‌ల్ గా ట్విస్ట్ ఇచ్చారు సీఎం రేవంత్. దీనితోపాటు... ఈ- కార్... కేసును సైతం సీబిఐ కి అప్ప‌గించింది స‌ర్కార్. సీబిఐ కి అప్ప‌గింత వెనుక‌.... రాజ‌కీయంగా బిఆర్ఎస్, బిజేపిల‌ను ఒకేసారి టార్గెట్ చేసే ఫ్యూహాన్ని అమ‌లు చేశారు రేవంత్. రాష్ట్రంలో సంచ‌నం సృష్టించిన‌... ఫోన్ ట్యాపింగ్ కేసుపై SIT ఏర్పాటు చేసింది ఈఏడాదే. ఈ కేసులో త్వ‌ర‌లోనే కేసీఆర్, కేటీఆర్ సహా కీలక వ్యక్తులు విచారణ ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తుంది. ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, బిఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ తో క్విడ్ ప్రోకో జరిగిందనే అనుమానం. ఈ కేసులో కేటీఆర్ విచారణ కు గవర్నర్ ఆమోదం లభించగా ఐఏఎస్ ఆర‌వింద్ కుమార్ D.O.P.T అనుమతి పెండింగ్ లో ఉంది. అనుమతి రాగానే ఈకేసులో సైతం కీలక అరెస్ట్ లు జరిగే ఛాన్స్ ఉంద‌ని పొలిటిక‌ల్ టాక్.

మొత్తానికి... 2025 లో జ‌రిగిన ఎన్నికల్లో విజయాలు, అమ‌లు చేసిన సంక్షేమ పథకాలు, నిర్వ‌హించిన గ్లోబల్ ఈవెంట్లు.. భారీ విదేశీ పెట్టుబడులు ఇవన్నీ రేవంత్ నాయకత్వానికి బలమైన బూస్ట్ ఇచ్చాయి. దీంతో.... ఐదేళ్లు సీఎం కుర్చీలో ఉంటారో లేదో... అన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేసి... త‌న లీడ‌ర్ షిప్ ను అందనంత ఎత్తులకు తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో రేవంత్‌ను స్ట్రాంగ్ లీడర్‌గా నిలిచారు. భవిష్యత్ లక్ష్యాలతో దూసుకుపోతున్న రేవంత్ సర్కార్ ను నూతన సంవత్సరంలో కూడా దావోస్ పర్యటనతో ముందుకు సాగనుంది.

Tags:    

Similar News