Hyderabad Metro: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ మెట్రో సర్వీసులు!

Hyderabad Metro: 2026 నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) తన సేవల సమయాన్ని పొడిగించింది.

Update: 2025-12-30 10:43 GMT

Hyderabad Metro: 2026 నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) తన సేవల సమయాన్ని పొడిగించింది. ఈ నెల 31న (బుధవారం) అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

అన్ని కారిడార్లలోని ప్రారంభ స్టేషన్ల (Terminating Stations) నుంచి రాత్రి 1:00 గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయి. ఈ చివరి రైళ్లు తమ గమ్యస్థానాలకు దాదాపు రాత్రి 2:00 గంటల ప్రాంతంలో చేరుకుంటాయి. సాధారణ రోజుల్లో రాత్రి 11:00 గంటలకే చివరి మెట్రో సర్వీసులు ముగుస్తాయి. కానీ న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా అదనంగా మరో రెండు గంటల పాటు సేవలను పొడిగించారు.

మెట్రో స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి మరియు ప్రయాణికుల భద్రత కోసం అదనపు భద్రతా సిబ్బందిని కూడా మోహరించనున్నారు. మద్యం తాగి మెట్రోలో ప్రయాణించే వారిపై నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు సూచించారు.

Tags:    

Similar News