నిజాంపేటలో కొండచిలువ హల్ చల్
Nizampet: నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో సాయి ఎలైట్ అపార్ట్ మెంట్ లో కొండచిలువ హల్ చల్ చేసింది. అపార్ట మెంట్ సెల్లార్ లోకి తొమ్మిది అడుగుల కొండ చిలువ రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అపార్ట మెంట్ వాసులు స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ వచ్చి కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.