Uttam Kumar Reddy: కేసీఆర్ పాలనలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు
Uttam Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.
Uttam Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో ఎక్కువ మిత్తిలకు అప్పులు తెచ్చారని ఆయన విమర్శించారు. 70వేల కోట్లు అయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు.. 27వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కేవలం 36శాతం పనులు మాత్రమే అయ్యాయన్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఎందుకంత మోజు.. పాలమూరుపై ఎందుకు అంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.