Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది
Harish Rao: అసెంబ్లీని కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టామన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు.
Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది
Harish Rao: అసెంబ్లీని కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టామన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. వారం రోజులు సభ జరుపుతామని స్పీకర్ చెప్పారని.. వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నదీ జాలలపై సభలో బీఆర్ఎస్ కూడా PPTకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 15అంశాలపై సభలో చర్చించాలని పట్టుబట్టామన్నారు.
మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ సవాసం పట్టుకుందనిదన్నారు హరీష్‌రావు. పాలమూరు ప్రాజెక్టు వాటను 90 నుంచి 45TMCలకు తగ్గించారా లేదా చెప్పాలన్నారు. DPR వాపస్ వచ్చినా...మౌనం ఎందుకని ప్రశ్నించారు. కోడంగల్ నారాయణపేట లిఫ్ట్‌కు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టి...DPR ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. SLBCపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1900కోట్లు ఖర్చు పెట్టిందని...ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ హాయంలో 3DPRలు వాపస్ వచ్చాయని...రెండేళ్ళల్లో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదని చిట్‌చాట్‌లో హరీష్‌రావు తెలిపారు.