Lingampalli: వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. రెండు అపార్ట్‌మెంట్స్ వాసులను ఖాళీ చేయించిన పోలీసులు
Lingampalli: పక్కన సెల్లార్ నిర్మాణ పనులతో కూలిన గోడ
Lingampalli: వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. రెండు అపార్ట్‌మెంట్స్ వాసులను ఖాళీ చేయించిన పోలీసులు
Lingampalli: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లింగంపల్లి నల్లగండ్లలో ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు భయాందోళన చెందారు. నల్లగండ్లలో శ్రావ్యా, స్వాతిక అపార్ట్ మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టారు. సెల్లార్ నిర్మాణ పనుల వల్ల పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ ప్రహరీ గోడ కూలిపోయింది. రెండు అపార్ట్ మెంట్లలో ఉంటున్న వారిని పోలీసుల సహాయంతో నిర్మాణ సంస్థ ఖాళీ చేయించింది. రాత్రి ఎక్కడి పోవాలో తెలియక అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.