కొమురం భీం జిల్లాలో కూలిన ఎంపీడీవో భవనం గోడ..
Komaram Bheem District: ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
కొమురం భీం జిల్లాలో కూలిన ఎంపీడీవో భవనం గోడ..
Komaram Bheem District: కొమురం భీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చింతలమానెపల్లి మండలంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎంపీడీవో కార్యాలయం గోడ కూలిపోయింది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. గోడ కూలిన సమయంలో ఆఫీస్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చింతలమానెపల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీడీవో కార్యాలయంగా మార్చారు. వర్షాలకు ఆ భవనం కాస్తా చాలా వరకూ కూలడంతో నూతన భవనాన్ని నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.