ఏపీ అక్రమంగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుందని తెలంగాణ సర్కార్‌ ఆరోపణ

* కృష్ణా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు * ఏపీలోని ప్రాజెక్ట్‌లను పరిశీలించిన కేఆర్‌ఎంబీ బృందం

Update: 2021-08-13 05:15 GMT

కృష్ణా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు (ఫైల్ ఫోటో)

Telangana: కరువు సీమ రాయలసీమకు మంచి రోజులు వస్తాయా.. కృష్ణా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏం నివేదిక ఇస్తుంది. తెలంగాణ, ఏపీ జల వివాదం నేపథ్యంలో సీమ ప్రాజెక్ట్ పరిశీలనలో కమిటీ ఏం గుర్తించింది. కేఆర్‌ఎంబీ ఈ నెల 16న ఇచ్చే నివేదికలో ఏం తేల్చనుంది. రాయలసీమ ప్రాజెక్ట్స్ కు అనుకూలంగా ఈ నివేదిక ఉంటుందా లేదంటే వ్యతిరేకంగా ఉంటుందా. ఇప్పుడివే ప్రశ్నలు రాయలసీమను వెంటాడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ నిర్మిస్తోందని తెలంగాణ సర్కార్ కృష్ణా రివర్ యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్, కేంద్ర జల వనరుల శాఖ అనుమతి లేకుండా ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల బృందం సీమ ప్రాజెక్ట్స్ పై తనిఖీలు చేపట్టింది. కమిటీ కన్వీనర్ డీఎం. రాయపూరే ఆధ్వర్యంలో రాయలసీమలోని ప్రాజెక్ట్‌లను పరిశీలించింది. ఈ తనిఖీలు సీమ వాసుల్లో ఆదోళన కలిగిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఇదే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను తెచ్చి పెట్టింది.

రాయలసీమ కరువు తీర్చేందుకు సహకారం అందిస్తామని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చట్టవిరుద్ధమంటూ ఆరోపణలు చేయడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీమ ప్రజలు సుదీర్ఘకాలంగా సాగు, తాగు నీటి సమస్య పరిస్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. మరి ఇప్పుడు కేఆర్ఎంబీ రిపోర్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News