తెలంగాణలో పదినెలల తర్వాత మోగనున్న బడిగంట

Update: 2021-01-31 09:24 GMT

Representational Image

కరోనా నేపథ్యంలో పదినెలల విరామం తర్వాత తెలంగాణలో మళ్లీ బడిగంటలు మోగనున్నాయి. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులతో కుస్తీలు పట్టిన విద్యార్దులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పాఠశాలలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్కూళ్ల ఓపెన్ పై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనాలు పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కరోనా తీవ్రత తగ్గడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి తెలంగాణలో స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. తొమ్మిదో, పదో తరగతి క్లాసులు ప్రారంభంకానున్నాయి. కోవిడ్ రూల్స్ ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్లాస్ రూమ్ లను సిద్ధం చేశారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 3186 పాఠశాలలు ఉండంగా, అందులో తొమ్మిది, పదో తరగతుల చదువుతున్న విద్యార్దులు లక్షకుపైగా ఉన్నారు. కరోనా నిబంధనల మేరకు పాఠశాలలను శానిటైజ్ చేయించారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రుల నుంచి అంగీకర పత్రం తీసుకురావాలి, లేకుంటే క్లాసులకు అనుమతి లేదంటున్నారు హెడ్ మాస్టర్లు. పాఠాలు భోదింటీచర్లు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ భోదనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. స్కూళ్లలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

స్కూళ్లు తెరుస్తుండడంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఆన్ లైన్ భోదన అంతగా బుర్రకెక్కలేదంటున్నారు. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్లు లేదా ఫ్రెండ్స్ అడిగి తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పది నెలల తర్వాత స్కూళ్లు తెరుస్తుండడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. క్లాస్ ల్లో పాఠాలు వినొచ్చని, ఫ్రెండ్స్ తో కలువొచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News